69వ శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌-2024 (69th sobha filmfare awards south 2024) వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అనంతరం నాని (Nani) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

[ad_1]

ఇంటర్నెట్‌డెస్క్‌: 69వ శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌-2024 (69th sobha filmfare awards south 2024) వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ‘దసరా’ (Dasara) చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నాని (Nani) అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెరీర్‌ ఆరంభంలో తాను ఎన్నో అవార్డుల కార్యక్రమాల్లో పాల్గొన్నానని.. తాను కూడా అవార్డు అందుకోవాలనుకున్నానని చెప్పారు. ఇప్పుడు తాను ఆ విధంగా అనుకోవడం లేదని తెలిపారు.

‘‘ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో స్టేజ్‌ మీద అవార్డులు అందుకుంటున్న నటీనటులను చూసినప్పుడు ఏదో ఒకరోజు ఆ స్థాయికి వెళ్లాలనే కోరిక బలంగా ఉండేది. అయితే, క్రమంగా ఆ కోరిక తగ్గిపోతూ వచ్చింది. అవార్డులపై ఇప్పుడు అంత ఆసక్తి లేదు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే.. నా సినిమా దర్శక నిర్మాతలు, టెక్నిషియన్స్, నటీనటులతోపాటు నా నిర్మాణ సంస్థలో పరిచయమైన నూతన నటీనటులు అవార్డులు తీసుకుంటే అందరితోపాటు కూర్చొని చూడాలని అనుకుంటున్నా. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది అవార్డు గురించి కాదు. శ్రీకాంత్‌ ఓదెల (దసరా దర్శకుడు), శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న దర్శకుడు) అవార్డులు అందుకుంటుంటే చూడాలని. ఉత్తమ పరిచయ దర్శకుల విభాగంలో వారిద్దరూ అవార్డు సొంతం చేసుకోవడం.. వాటిని నేను అందజేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. కొత్త టాలెంటెడ్‌ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌ ప్రయాణంలో నేనూ భాగమైతే అది నాకెంతో ఆనందాన్నిస్తుంది. మీ తొలి అడుగులో నేనొక ఇటుకగా మారితే అదే నాకు పెద్ద అవార్డు. అది చాలు నాకు. 2023 నాకెంతో ప్రత్యేకమైనది. థ్యాంక్యూ సో మచ్‌’’ అని నాని అన్నారు.

‘బలగం’ (Balagam)తో ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న వేణు యెల్దండి (Venu Yeldandi) మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. ఎన్నో అవార్డుల ఫంక్షన్లు చూశా. మనం కూడా ఏదో ఒక రోజు తప్పకుండా స్టేజ్‌ మీదకు వెళ్లాలి. అవార్డు అందుకోవాలనే  ఆసక్తి ఉండేది. ఆ రోజు కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఫైనల్‌గా ఆరోజు నేడు సాకారం అయ్యింది’’ అని తెలిపారు.

ఫిలింఫేర్‌ తమిళం విభాగంలో ఉత్తమ నటుడిగా అవార్డు గెలుపొందారు విక్రమ్‌ (Vikram). ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ (Ponniyin selvan 2)కు గానూ ఆయన ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. దీనిపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆదిత్య కరికాలన్‌ పాత్రకు తనని ఎంచుకున్నందుకు మణిరత్నంకు థ్యాంక్యూ చెప్పారు. తమ చిత్రాన్ని ఆదరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదే కార్యక్రమంలో తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరించారు నటి గాయత్రి భరద్వాజ్‌ (Gayatri Bhardwaj). రెడ్‌కార్పెట్‌పై ఆమె విలేకర్లతో మాట్లాడారు. తనకు రామ్‌చరణ్‌ (RamCharan) అంటే ఇష్టమన్నారు. అవకాశం వస్తే ఆయనతో కలిసి రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేయాలని ఉందని చెప్పారు.

[ad_2]

Source link

  • Varatavaradhi

    నమస్కారం! వార్త వారధి కి స్వాగతం ! ఇక్కడ సినిమాకు సంబంధించిన న్యూస్ , ఏ ఓ టీ టీ లో, ఏ సినిమా, ఏ వెబ్ సిరీస్ లో ఏ సిరిస్ ప్రారంభమైనది . ఎప్పుడూ రిలీజ్ అవుతాయి .అనే విషయాలు రాజకీయాలకు వార్తలు ,ట్రావెల్ కి వార్తలు , బిజినెస్ న్యూస్ ,ఇలా ప్రతి విషయం వార్త వారిలో మీరు చూడొచ్చు.

    Related Posts

    [Action required] Your RSS.app Trial has Expired.

    [ad_1] RSS Feed Integrations Make your RSS feed work better by integrating with your favorite platforms. Save time by connecting your tools together. No coding required Add dynamic news feeds…

    Shashi Tharoor: వయనాడ్‌లో పర్యటించిన తర్వాత శశి థరూర్ చేసిన ఎక్స్‌ పోస్ట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా ఆయన వివరణ ఇచ్చారు.

    [ad_1] తిరువనంతపురం: ఆకస్మిక వరదలతో అల్లకల్లోలమైన వయనాడ్‌ (Wayanad) ప్రాంతంలో కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) శనివారం పర్యటించారు. బాధితులను పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తనవంతుగా కొంత సహాయ సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా తన పర్యటనను ‘మరపురానిది’గా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    [Action required] Your RSS.app Trial has Expired.

    [Action required] Your RSS.app Trial has Expired.

    Shashi Tharoor: వయనాడ్‌లో పర్యటించిన తర్వాత శశి థరూర్ చేసిన ఎక్స్‌ పోస్ట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా ఆయన వివరణ ఇచ్చారు.

    Shashi Tharoor: వయనాడ్‌లో పర్యటించిన తర్వాత శశి థరూర్ చేసిన ఎక్స్‌ పోస్ట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా ఆయన వివరణ ఇచ్చారు.

    విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు

    విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు

    భారతదేశం అంటే గుర్తుకు వచ్చేది చీరకట్టు, సంప్రదాయం అని హోం మంత్రి అనిత తెలిపారు.

    భారతదేశం అంటే గుర్తుకు వచ్చేది చీరకట్టు, సంప్రదాయం అని హోం మంత్రి అనిత తెలిపారు.