[ad_1]
రష్యా ఆక్రమిత క్రిమియాలోని సెవస్తొపోల్ నౌకాశ్రయంలో ఆ దేశానికి చెందిన ఓ జలాంతర్గామిని నీటముంచేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా (Russia) లక్ష్యంగా ఉక్రెయిన్ (Ukraine) భీకర దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రష్యా ఆక్రమిత క్రిమియాలోని సెవస్తొపోల్ నౌకాశ్రయంలో ఆ దేశానికి చెందిన ఓ జలాంతర్గామి (Russian Submarine)ని నీటముంచేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. ప్రస్తుతం ఆ సబ్‌మెరైన్ (బీ-237 ‘రోస్తోవ్ నా దోను’) నల్ల సముద్రం (Black Sea) అడుగుకు పడిపోయినట్లు వెల్లడించింది.
స్వల్పశ్రేణి రాకెట్.. ఏడు కిలోల వార్‌హెడ్.. ‘పథకం ప్రకారం హనియా హత్య’
క్రిమియాలో మోహరించిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థకు చెందిన నాలుగు లాంచర్లనూ తీవ్రంగా దెబ్బతీసినట్లు కీవ్ తెలిపింది. మోరోజోవ్స్క్ వాయుసేన స్థావరం, ఆయుధ నిల్వ కేంద్రాలు, ఇంధన స్థావరాలపైనా దాడిచేసినట్లు తెలిపింది. అంతకుముందు ఉక్రెయిన్ ప్రయోగించిన 75 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఒక్క రొస్తోవ్ రీజియన్‌లోనే 36 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది.
[ad_2]
Source link