[ad_1]
హైదరాబాద్: నగరంలోని పెద్ద గోల్కొండ వద్ద అవుటర్ రింగ్ రోడ్డుపై పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. పెద్ద అంబర్‌పేట్ వైపు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఓ కంటైనర్‌లో సుమారు 800 కిలోల గంజాయిని బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ఒడిశా నుంచి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసులు కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
[ad_2]
Source link